ఉషోదయమే నీ రూపం,
నీటిలోనే నీ ప్రతిబింబం.
నిండు జాబిలి నీ అందం,
అది నా మనసులో మల్లె చందనం.
నీటిలోనే నీ ప్రతిబింబం.
నిండు జాబిలి నీ అందం,
అది నా మనసులో మల్లె చందనం.
లోలోన ప్రాణం,
పెదవిపయిన మౌనం.
పరితపించే ప్రణయం,
ఊహకందని అభిమానం.
పెదవిపయిన మౌనం.
పరితపించే ప్రణయం,
ఊహకందని అభిమానం.
సిరివెన్నెల శిల్పమా, సిరికి ప్రాణమా.
కలిసే చైత్రమా, పలికే మౌనమా.
కరిగే కావ్యమా, కదిలే బింబమా.
నిదురించే వేళ కలవై రావా.
కలిసే చైత్రమా, పలికే మౌనమా.
కరిగే కావ్యమా, కదిలే బింబమా.
నిదురించే వేళ కలవై రావా.
By: SJ